TS Polling: చార్మినార్‌లో కాంగ్రెస్, ఎంఐఎం ఘర్షణ
ABN , First Publish Date - 2023-11-30T15:54:50+05:30 IST
పాతబస్తీలోని హుస్సేనిహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి సోదరుడు సలీంపై ఎంఐఎం నాయకులు దాడి చేశారు.
హైదరాబాద్: పాతబస్తీలోని హుస్సేనిహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి సోదరుడు సలీంపై ఎంఐఎం నాయకులు దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా గురువారం మధ్యాహ్నం చోటా బజార్ ప్రాంతంలోని ఓషియన్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌ను సలీం పరిశీలించడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎంఐఎం నాయకులు సలీంకు ఎదురుపడడంతో వాగ్వాదం నెలకొంది. చివరకు ఇది ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఓకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పొలీసులు సలీంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘర్షణ నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు.