Ponnam Prabhakar: సెంటిమెంట్‌కు హుస్నాబాద్.. అభివృద్ధికి సిద్ధిపేట, గజ్వేలా?
ABN , First Publish Date - 2023-11-10T11:00:52+05:30 IST
గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు బేడీలు వేయించి, కొట్టించిన ఎమ్మెల్యేకు ఓట్లు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు బేడీలు వేయించి, కొట్టించిన ఎమ్మెల్యేకు ఓట్లు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Former MP Ponnam Prabhakar) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌పై (BRS Candidate Satish Kumar) హుస్నాబాద్ అభివృద్ధి వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేశారు. హుస్నాబాద్‌లో అభివృద్ధి రంగంపై ధ్యాస లేదన్నారు. సెంటిమెంటుకేమో హుస్నాబాద్, అభివృద్ధికేమో సిద్దిపేట, గజ్వేల్ అని వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలలో స్థానికుడిగా ఓటు హక్కు నమోదు చేసుకోని ఎమ్మెల్యే స్థానికుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యుడిగా చేసిన అభివృద్ధిపై తాను ఎప్పటికైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సిరిసిల్ల, వేములవాడ పరిణామాలను చూస్తే ఈ రాష్ట్రమంతా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అర్థమైపోతుందన్నారు. ఈ ఎన్నికలు సమదర్ధుడికి అసమర్థుడికి మధ్య పోటీ అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు.