Share News

Telangana Elections: పార్టీల వారీగా ఆస్తుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టాప్.. కోమటిరెడ్డి ఏ స్థానంలో ఉన్నారంటే?

ABN , First Publish Date - 2023-11-11T10:00:47+05:30 IST

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా నిన్నటితో (శుక్రవారం) నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నామినేషన్లు 4795 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 451 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. మొత్తం 778 సెట్ల నామినేషన్స్ దాఖలయ్యాయి.

Telangana Elections: పార్టీల వారీగా ఆస్తుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టాప్.. కోమటిరెడ్డి ఏ స్థానంలో ఉన్నారంటే?

నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా నిన్నటితో (శుక్రవారం) నామినేషన్ల (Nominations) ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నామినేషన్లు 4795 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 451 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. మొత్తం 778 సెట్ల నామినేషన్స్ దాఖలయ్యాయి. అత్యధికంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 51 మంది, దేవరకొండలో 18 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలయ్యాయి. అలాగే ఆయా అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమ ఆస్తిపాస్తుల వివరాలను ప్రకటించారు. ఆస్తిపాస్తుల విషయంలో పార్టీల వారిగా చూస్తే బీఆర్‌ఎస్‌‌లో భువనగిరి ఎమ్మెల్యే (BRS Candidate) మొదటి స్థానంలో నిలవగా.. కాంగ్రెస్‌లో మునుగోడు అభ్యర్ధి (Congress Candidate) రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ పార్టీలోనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Bhuvanagiri MLA Payla Shekhar Reddy) రూ.257.51 కోట్ల ఆస్తులతో ప్రధమస్థానంలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో 458.39 కోట్ల ఆస్తులతో మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Congress Candidate Komatireddy Rajagopal Reddy) రెండో స్థానంలో నిలిచారు.

Updated Date - 2023-11-11T11:13:37+05:30 IST