ED and IT Raids: సోమాజిగూడలోని వివేక్ ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు
ABN , First Publish Date - 2023-11-21T10:09:11+05:30 IST
Telangana Elections: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్: మాజీ ఎంపీ, చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ (Former MP Vivek) ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు (ED, IT Raids) రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం సోమాజిగూడాలోని వివేక్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి.
దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు జరిగాయి. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన రూ.8 కోట్ల నగదుపై ఐటీ ఆరా తీసింది. అయితే వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈడీ అధికారులు వెళ్లిపోయారు. ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు, నగదును కూడా అధికారులు సీజ్ చేయనట్లు తెలుస్తోంది. అటు మంచిర్యాలలో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి