Share News

Ponguleti Srinivasreddy: ఐటీ రైడ్స్‌పై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-09T11:42:24+05:30 IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

Ponguleti Srinivasreddy: ఐటీ రైడ్స్‌పై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: తన ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు (IT Raids) నిర్వహిస్తున్న దాడులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Former Minister Ponguleti Srinivasreddy) స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై (Congress Leaders) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government), నాయకుల వద్ద ఉన్నాయని మండిపడ్డారు. కానీ ఐటీ అధికారులు తన ఇంటి, కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయడం హేయమైనదని పొంగులేటి విమర్శించారు. తనపై ఐటీ దాడులు చేయడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడి కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 వ తేదీన కాంగ్రెస్ గెలుపొందడం పక్కా అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


బీఆర్‌ఎస్, బీజేపీ.. రెండు పార్టీలూ వేధిస్తున్నాయి...

‘‘ఐటీ, సీఆర్పీఎఫ్ అధికారులు పది మంది ఇంటికి వచ్చారు. నాకు ముందే తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ఇళ్ల మీద దాడులు సాగుతున్నాయి. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.. బీజేపీతో పొల్యూట్ అయ్యారు. ఐటీ దాడులను చేయిస్తున్నారు కేసీఆర్. నా మీద ఫోకస్ పెట్టీ ఇబ్బందులు పెడతారని తెలుసు. నా మీద, మువ్వ విజయబాబు మీద వేధింపులు స్టార్ట్ చేశారు. బీజేపీలోకి రాలేదని, బీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లానని... ఆ రెండు పార్టీల నేతలు ఇబ్బందులు పెడుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి జనవరిలో బయటకు వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారు. బీజేపీలోకి రావాలని ఆనాడు చెప్పారు.. నేను వెళ్ళలేదు కానీ సున్నితమైన వార్నింగ్‌లు బీజేపీ నుంచి కూడా వచ్చాయి. నామినేషన్ వేయాలని అనుకున్నా. ఈ రోజే కావాలని ఉద్దేశ్యపూర్వకంగా నన్ను నమ్ముకున్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈ ఐటీ దాడులు. కేసీఆర్‌ను విమర్శించే వారిని కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం బీఆర్‌ఎస్‌కు అలవాటు. 32 ప్రాంతాల్లో వేర్వేరు రాష్ట్రాల నుంచి యుద్ద ప్రాతిపదికన సోదాలు జరుగుతున్నాయి. రాజ్యాంగపరంగా పోరాడుతాను. ఎన్ని సోదాలు చేసిన ఇబ్బందులు పెట్టిన భయపడను. జైల్లో పెట్టిన్పటికీ నేను వెనకకి తగ్గేది లేదు. బీఆర్‌ఎస్ లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంటే వారిపై ఎందుకు తనిఖీలు లేవు. పార్లమెంట్‌లో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుని రావడానికి సిద్దం. ఏడాది పాటు జైల్‌కు పంపిన నేను పోరాటం చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయి. నామినేషన్ వేయకుండా చేస్తే లక్షలాది మంది వస్తారని చెప్పాను. దొడ్డిదారిన ఇబ్బందులు పెడుతున్నారు.. ప్రజలు బుద్ధి చెబుతారు’’ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-11-09T11:58:26+05:30 IST