KTR : ఉద్యోగాల భర్తీ వెబ్సైట్ను ప్రారంభించిన కేటీఆర్
ABN , First Publish Date - 2023-11-21T22:47:20+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమాచారంతో రూపొందించిన వెబ్సైట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) ప్రారంభించారు.
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమాచారంతో రూపొందించిన వెబ్సైట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) ప్రారంభించారు. వెబ్సైట్లో తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పొందుపరిచారు. ఇప్పటివరకు లక్ష అరవై వేలకు పైగా ఉద్యగాలు భర్తీ చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు.