Share News

Mallu Ravi: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

ABN , First Publish Date - 2023-12-07T16:21:58+05:30 IST

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి( Mallu Ravi ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది...తెలంగాణ సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్టు అయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ మళ్లీ వచ్చింది’’ అని మల్లు రవి పేర్కొన్నారు.

Mallu Ravi: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి( Mallu Ravi ) వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకార చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్లు రవి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది...తెలంగాణ సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్టు అయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ మళ్లీ వచ్చింది. తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేసి, తొలి ఉద్యోగం ఇచ్చి, ప్రగతి భవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చి, ప్రజా దర్బార్‌కి శ్రీకారం చుట్టడంతో తెలంగాణలో తొలి రోజే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం హర్షణీయం’’ అని మల్లు రవి తెలిపారు.

Updated Date - 2023-12-07T16:36:30+05:30 IST