Share News

Asaduddin : వైఎస్ షర్మిల ఎవరో తెలియదు.. వైఎస్సార్ బిడ్డయితే ఏంటి..!?

ABN , First Publish Date - 2023-11-03T16:22:09+05:30 IST

వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.

Asaduddin : వైఎస్ షర్మిల ఎవరో తెలియదు.. వైఎస్సార్ బిడ్డయితే ఏంటి..!?

హైదరాబాద్: వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై (YSRTP Chief YS Sharmila Reddy) ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (MIM chief Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు. దీనిపై అసద్ మాట్లాడుతూ... ‘‘షర్మిల ఎవరో నాకు తెలియదు... ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో తెలియదు. రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) బిడ్డ అయితే తోపా... అది ప్రజలు నిర్ణయిస్తారు’’ అంటూ కామెంట్స్ చేశారు.


అసద్ ఇంకా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ (BRS) ఎవ్వరి మద్దతు లేకుండా అధికారంలోకి వస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తొమ్మిది నియోజక వర్గాల్లో ఎంఐఎంకు (MIM) ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో (Telangana State) శాంతి సామరస్యలు ఉండాలి అంటే అది బీఆర్‌ఎస్ వల్లే సాధ్యమని చెప్పుకొచ్చారు. రాజేంద్రనగర్‌లో ప్రకాష్ గౌడ్ (Prakash Reddy), జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఇద్దర్నీ ఓడగొడతామని స్పష్టం చేశారు. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy) పారిపోయారని.. ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) హైదరాబాద్ నుండి పోటీ చేయాలన్నారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారని.. మీడియా అందరినీ అమేథీ తీసుకుపోతే పారిపోయి వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్‌లో సీఎం ‘‘నువ్వా నేనా’’ అని కొట్లాడుతున్నారని అన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) బీసీ కదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారని నిలదీస్తూ.. ఇక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్మాలని అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-03T16:32:24+05:30 IST