Harishrao: ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ భావోద్వేగం
ABN , First Publish Date - 2023-10-30T19:58:05+05:30 IST
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy ) కోలుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు ( Minister Harishrao ) భావోద్వేగానికి గురయ్యారు.
హైదరాబాద్ : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Prabhakar Reddy ) కోలుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు ( Minister Harishrao ) భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం నాడు మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం కొత్త ప్రభాకర్‌రెడ్డికి శస్త్ర చికిత్స జరుగుతోంది. కత్తి గాటుతో శరీరం లోపల బ్లీడింగ్ అయినట్లు వైద్యులు తెలిపారు. రెండు గంటల పాటు శస్త్ర చికిత్స చేయ్యాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. రాజకీయాల్లో హత్యా రాజకీయాలు పనికి రావు. ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి.. హత్య రాజకీయలు సరికాదు’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.