Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2023-10-31T12:47:47+05:30 IST
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy ) ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ( Minister Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు.
హైదరాబాద్: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy ) ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీష్‌రావు ( Minister Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ...‘‘ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షించాము. ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుట పడింది. ఆయన ఆరోగ్యంపై నిరంతరం వైద్యులు అలెర్ట్‌గా ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు ప్రభాకర్‌రెడ్డి సంఘటనపై కోడి కత్తి అని హేళన చేస్తున్నారు. చిల్లర రాజకీయాలు చేస్తూ కోడి కత్తి అని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారు. చిన్న పేగు దెబ్బ తిని, సర్జరీ చేసి వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి సంఘటనపై పోలీసులు విచారణ ముుమ్మరంగా జరుగుతుంది. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి దాడి సంఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలుపుతారు. నిందితుడు కాల్ డేటాపై కూడా పోలీస్ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితుడు ఎవరెవరితో మాట్లాడారనే దానిపై పోలీసులు సీరియస్‌గా విచారిస్తున్నారు. గతంలో బీహార్, రాయలసీమలో ఫ్యాక్షన్‌లో కత్తి పోట్లు చూశాము. ఇప్పటి వరకు ఇలాంటి దాడులు తెలంగాణ రాష్ట్రలో చూడలేదు. ఈ దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధుల భద్రతపై ఎన్నికల కమిషన్ సమీక్ష చేసి భద్రత పెంచాలని కోరుతున్నాం’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.