KTR Nomination: సిరిసిల్లలో నామినేషన్ వేసిన కేటీఆర్
ABN , First Publish Date - 2023-11-09T12:53:42+05:30 IST
Telangana Elections: సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా.. స్కీములు కావాలా కాంగ్రెస్ స్కాములు కావాలా’’ అని ప్రశ్నించారు.
సిరిసిల్ల: సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ (Minister KTR Filed Namination) దాఖలు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల బరిలో నిల్చోవడం ఇది ఐదవసారి. గురువారం ఉదయం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా.. స్కీములు కావాలా కాంగ్రెస్ స్కాములు కావాలా. కులం మతం పేరుతో చిచ్చుపెట్టే వాళ్ళు వద్దు. ఢిల్లీ, గుజరాత్‌లకు సామతులం కావొద్దు. వేరేవాళ్లకు అధికారం ఇస్తే తెలంగాణ 50 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. సిరిసిల్ల నన్ను మళ్లీ దీవిస్తుంది. సాగునీరు, తాగునీరు ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు. కేసీఆర్ గొంతు నొక్కాలని రాహుల్, మోదీ చూస్తున్నారు. ఢిల్లీ, బెంగుళూరు అనుమతులు మాకు అవసరం లేదు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఈరోజు ఉదయం నామినేషన్‌కు వెళ్లే ముందు తన నివాసం ప్రగతిభవన్‌లో కేటీఆర్ పూజలు నిర్వహించి.. వేద పండితులు ఆశీర్వచనాలు పొందారు. అనంతరం అక్కడి నుంచి సిరిసిల్లకు బయలుదేరి అక్కడి ఆర్డీవో కార్యాలయంలో మంత్రి నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.