Supreme Court: ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో మంత్రి మల్లారెడ్డికి ఊరట
ABN , First Publish Date - 2023-11-28T16:49:39+05:30 IST
న్నికల ముందు సుప్రీంకోర్టు ( Supreme Court ) లో మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) కి ఊరట లభించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి మల్లారెడ్డిని నిలువరించాలని దాఖలైన పిటీషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ: ఎన్నికల ముందు సుప్రీంకోర్టు ( Supreme Court ) లో మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) కి ఊరట లభించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి మల్లారెడ్డిని నిలువరించాలని దాఖలైన పిటీషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మూడు ఆఫిడవిట్లలో మూడు విధాలుగా తన విద్యా అర్హతలను పిటీషనర్ పొందుపరిచారు. తమ అభ్యంతరాలు లేవనెత్తిన రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని పిటీషనర్ పేర్కొన్నారు. హైకోర్టు ముందుకు వెళ్లిన హైకోర్టు కూడా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటీషనర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులల్లో ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్ అంజయ్రెడ్డికి లేదని ధర్మాసనం పేర్కొంది. మల్లారెడ్డి తరపున న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.