Niranjan: కేసీఆర్, హరీశ్‌రావులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
ABN , First Publish Date - 2023-11-18T16:16:27+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కాంగ్రెస్ పార్టీపై బహిరంగ సభల్లో చేసిన ధూషణలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ( Niranjan ) తెలిపారు. శ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కాంగ్రెస్ పార్టీపై బహిరంగ సభల్లో చేసిన ధూషణలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ( Niranjan ) తెలిపారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘పరకాలలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని దొకేబాజీ పార్టీ అని నిందించారు. మంత్రి హరీశ్‌రావు నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అన్నారు. ఒక పార్టీని అడ్డగోలుగా మాట్లాడ్డాడాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. పార్టీ నాయకులపై, పార్టీపై ఇలాంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని ఉపసంహరించుకోవాలి. సోనియాగాంధీ కృషి వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాటలను కూడా వక్రీకరించి మాట్లాడారు బీఆర్ఎస్ నేతలకు ఇది పద్ధతి కాదు’’ అని నిరంజన్ హితవు పలికారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి