Share News

Niranjan: బీఆర్ఎస్ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది

ABN , First Publish Date - 2023-11-27T23:03:43+05:30 IST

రైతుబంధు పంపిణీని ఎన్నికల కమిషన్ ఉపసంహరించడానికి మంత్రి హరీశ్‌రావే కారణమని కాంగ్రెస్ నేత నిరంజన్ ( Niranjan ) అన్నారు. సోమవారం నాడు బీఆర్కే భవన్‌లో సీఈవో వికాస్‌రాజ్‌ని కాంగ్రెస్ నేతలు కలిశారు.

Niranjan: బీఆర్ఎస్ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది

హైదరాబాద్ : రైతుబంధు పంపిణీని ఎన్నికల కమిషన్ ఉపసంహరించడానికి మంత్రి హరీశ్‌రావే కారణమని కాంగ్రెస్ నేత నిరంజన్ ( Niranjan ) అన్నారు. సోమవారం నాడు బీఆర్కే భవన్‌లో సీఈవో వికాస్‌రాజ్‌ని కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారంలో రైతుబంధుని వాడుకోవద్దని ఎన్నికల సంఘం చెప్పింది. రైతు బంధును ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. రైతు బంధుకు వ్యతిరేకమని, ఆపాలని కానీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయలేదు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అపమన్నది అనడం దురదృష్టకరం. రేవంత్‌రెడ్డి రైతు బంధు అపమన్నారని మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను ప్రజలు నిలదీయాలి. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖను చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని నిరంజన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-27T23:03:45+05:30 IST