Share News

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు కీలక సూచన.. ఆ 2 గంటల పాటు..!

ABN , First Publish Date - 2023-11-27T14:22:15+05:30 IST

మెట్రో ప్రయాణికులకు అధికారులు కీలక సూచన చేశారు. భాగ్యనగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు కీలక సూచన.. ఆ 2 గంటల పాటు..!

హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు అధికారులు కీలక సూచన చేశారు. భాగ్యనగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ రోడ్‌ షో నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో కమలం నేతలు ప్రచార జోరు పెంచారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్రధాని రోడ్డు షో ప్రారంభమై చిక్కడపల్లి, నారాయణగూడ ఫ్లైఓవర్‌, వైఎంసీఏ మీదుగా అంబర్‌పేట నియోజకవర్గం కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్‌ విగ్రహం వరకు కొనసాగనున్నది. అనంతరం ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

రోడ్ షో ప్లాన్ ఇదే..

ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, గోషామహల్‌ నియోజకవర్గాలు ఈ రోడ్‌షోకు ఇరువైపులా ఉండడం గమనార్హం. ప్రధాని రోడ్‌షోకు గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. గ్రేటర్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రోడ్‌షోలో 24 వేదికలను ఏర్పాటు చేసి ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన వేదిక నారాయణగూడ ఫ్లైఓవర్‌ పక్కన ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తదితరులు ఈ రోడ్‌షోలో ప్రధాని వెంట పాల్గొంటారు.

అమీర్‌పేటలో ఇలా..

ఇక సాయంత్రం 7.30 గంటలకు ప్రధాని మోదీ అమీర్‌పేటలోని గురుద్వారాకు రానునున్నారు. ఈ మేరకు ఎస్పీజీ ప్రొటక్షన్‌ఫోర్స్‌, సాయుధ బలగాలు ఆదివారం సందర్శించి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు గురుద్వారా చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి సీఆర్‌పీఎఫ్‌ సైనికులతో కలిసి కాపలా కాస్తున్నారు.

Updated Date - 2023-11-27T14:43:26+05:30 IST