Share News

BIG Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-12-04T19:37:58+05:30 IST

తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్‌ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.

BIG Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్‌ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.

వారు ఢిల్లీ వచ్చిన తర్వాతే సీఎంపై నిర్ణయం: మాణిక్యం ఠాగూర్

ఢిల్లీ: పార్లమెంట్ స్ట్రాటజీ కమిటీలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిపినట్లు కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ( Manikyam Tagore ) తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఏఐసీసీ పరిశీలకులకు అథారైజేషన్ ఇచ్చారని అన్నారు. పరిశీలకులు ఢిల్లీకి వస్తున్నారు. వారు అధిష్ఠాన పెద్దలతో భేటీ అవుతారని చెప్పారు. పరిశీలకులు ఏఐసీసీ అధ్యక్షుడి మల్లికార్జున ఖర్గేకి నివేదిక ఇస్తారన్నారు. ఎవరు సీఎం అనేది అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని మాణిక్యం ఠాగూర్ తెలిపారు.

ఏఐసీసీ అగ్ర నేతలు నిర్ణయం తీసుకుంటారు: జైరాం రమేష్

తెలంగాణ సీఎల్పీ నేత ఎంపికపై రేపు (మంగళవారం) ఏఐసీసీ అగ్ర నేతలు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ( Jairam Ramesh ) అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ స్టాటజీ కమిటీ సమావేశంలో సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదని జైరాం రమేష్ చెప్పారు.

Updated Date - 2023-12-04T19:58:10+05:30 IST