Sampath Kumar : BRS అభ్యర్థి విజయ్ నామినేషన్ల పత్రాల్లో తప్పులు ఉన్నా ఆర్వో పట్టించుకోవడం లేదు
ABN , First Publish Date - 2023-11-15T18:50:08+05:30 IST
BRS అలంపూర్ అభ్యర్థి విజయ్ 13వ తేదీన నామినేషన్ వేశారని ఈ నామినేషన్ల పత్రాల్లో అనేక తప్పులు ఉన్నా RO పట్టించుకోలేదని కాంగ్రెస్ అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ ( Sampath Kumar )అన్నారు.
అలంపూర్ : BRS అలంపూర్ అభ్యర్థి విజయ్ 13వ తేదీన నామినేషన్ వేశారని ఈ నామినేషన్ల పత్రాల్లో అనేక తప్పులు ఉన్నా RO పట్టించుకోలేదని కాంగ్రెస్ అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ ( Sampath Kumar )అన్నారు. బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ నామినేషన్ల పరిశీలన జరుగుతున్న సమయంలో ROకు ఒక ఫోన్ కాల్ రావడంతో BRS అభ్యర్థి నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. BRS అభ్యర్థి అసెంబ్లీ సెగ్మెంట్ పేరు రాయలేదు, కులం పేరును మెన్షన్ చేసే కాలంలో తప్పు రాశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉండి పత్రాల్లో తెలుపలేదు. ప్రభుత్వ అధికారులు BRS పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. CEO వికాస్ రాజ్‌కు అన్ని ఆధారాలతో సహా ఫిర్యాధు చేశా’’ అని సంపత్ కుమార్ తెలిపారు.