Share News

Sandra Venkata Veeraiah : ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉన్నారు

ABN , First Publish Date - 2023-10-31T14:05:26+05:30 IST

ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) వెంట ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ( Sandra Venkata Veeraiah ) అన్నారు.

Sandra Venkata Veeraiah : ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉన్నారు

ఖమ్మం: ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) వెంట ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ( Sandra Venkata Veeraiah ) అన్నారు. మంగళవారం నాడు కల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మీడియాతో మాట్లాడుతూ...‘‘రేపు కల్లూరులో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ఉంటుంది. ఈ భహిరంగ సభ కోసం ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మండలాల వారీగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం. సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నవంబర్ 9వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తాను. ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రచారంలో భాగంగా లక్ష కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేశాం. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి ఆధరణ పెరుగుతుంది. ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. శాసన సభ్యుడిగా ఉన్నా సామాన్య కార్యకర్తగా పనిచేశా’’ అని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

Updated Date - 2023-10-31T14:05:26+05:30 IST