Share News

Shock to BRS: ఇల్లందులో బీఆర్‌ఎస్‌కు షాక్.. మరో కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2023-11-09T09:20:08+05:30 IST

అధికారపార్టీ బీఆర్ఎస్‌‌కు మరో షాక్ తగిలింది. ఇల్లందులో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Shock to BRS: ఇల్లందులో బీఆర్‌ఎస్‌కు షాక్.. మరో కీలక నేత రాజీనామా

భద్రాద్రి కొత్తగూడెం: అధికారపార్టీ బీఆర్ఎస్‌‌కు (BRS) మరో షాక్ తగిలింది. ఇల్లందులో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు (Municipal Chairman Dammalapati Venkateswara Rao) పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (BRS Candidate Tummala Nageshwar rao) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధి కోసం గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని నాడు టీఆర్‌ఎస్‌లో (TRS) చేరామని.. తనతో పాటు వేలాది మంది పార్టీలో చేరారని తెలిపారు. అహంకార చర్యల వల్ల పార్టీ పెద్దలే ఓడించాలని చూశారన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి పాటు పడ్డానని.. చందాలు దందాలు అవినీతి అరాచక పాలనతో బీఆర్‌ఎస్‌ని వదిలేశామన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్‌లో చేరామన్నారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌గా డీ.వీ అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. తుమ్మలకు ముందు ఇల్లందు గుండాల ఏంటో తుమ్మల వచ్చిన తరువాత ఇల్లందు గుండాల ఏంటో చరిత్రలో చూశారని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో రహదారులు ఏర్పాటుతో విద్య వైద్యం ఏజెన్సీ వాసులకు దక్కాయన్నారు. తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ డీవీకి కాంగ్రెస్‌లో భవిష్యత్ బాధ్యత తనది అన్నారు. ఇల్లందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-09T10:21:51+05:30 IST