Tammineni Veerabhadram: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-29T17:06:14+05:30 IST
కాంగ్రెస్ పార్టీతో ( Congress Party ) పొత్తుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీతో ( Congress Party ) పొత్తుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు సీపీఎం పార్టీ కార్యాలయంలో తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ...‘‘ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే ఫోన్ మాకు చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడాలి రమ్మని చర్చలకు ఆహ్వానించారు. భద్రాచలం, మిర్యాలగూడెం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్దానాలు ఇవ్వాలని కోరాం. భద్రాచలం మా సిట్టింగ్ స్థానం ఆ సీటు కోసం పట్టుపట్టవద్దని కోరారు మేము కూడా అంగీకరించాము. పాలేరు ఇవ్వమని కోరారు..ముందు...ఇస్తామన్నారు...తర్వాత కుదరదని చెప్పారు. పాలేరు విషయంలో కూడా రాజీ పడ్డాము. వైరా ఇస్తామన్నారు....మేము ఒప్పుకున్నాము. రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఫోన్ చేసి ఇప్పుడు వైరా కూడా కుదరదు హైదరాబాద్ సిటీలో ఏదో ఒకటి ఇస్తామంటున్నారు. మిర్యాలగూడతో పాటు వైరా ఇస్తే ఇప్పటికైన మేము పొత్తుకు సిద్ధం అవుతాం. ఇంకా మెట్లు దిగిరావాలంటే మా వల్లకాదు. కొందరు కాంగ్రెస్ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ కలసి పోటీ చేద్దాం. సత్తా ఏంటో చూపిద్దామనే కాంగ్రెస్ అధిష్ఠానానికి చెబుతున్నాను. మరో రోజు ఎదురుచూస్తాము....కాంగ్రెస్ పార్టీ నుంచి లో స్పందన రాకపోతే ఒంటరిగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతాము’’ అని తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు.