TS Polls: బిర్లా టెంపుల్‌కు కాంగ్రెస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2023-11-29T12:40:53+05:30 IST
Telangana Elections: బిర్లా టెంపుల్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం గాంధీభవన్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్, పలువురు నేతలు బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. అయితే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: బిర్లా టెంపుల్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను (Congress Leaders) పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం గాంధీభవన్ (Gandhi Bhavan)నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), ఇంఛార్జి ఠాక్రే (In-charge Thackeray), అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), వీహెచ్ (VH) పలువురు నేతలు బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. అయితే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉన్నందున ఐదుగురు మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో పోలీసుల సూచనల మేరకు కేవలం రేవంత్, ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి మాత్రమే బిర్లా టెంపుల్‌కు వెళ్లారు. బిర్లా టెంపుల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామికి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి మరీ రేవంత్ రెడ్డి పూజలు చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి