TS Election: కాంగ్రెస్ ప్రచారంలో ఊహించని పరిణామం.. తీవ్ర భావోద్వేగానికి గురైన నారీమణులు
ABN , First Publish Date - 2023-11-24T12:16:57+05:30 IST
రోడ్ షోకు హాజరైన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసిన అభ్యర్థి ఆది శ్రీనివాస్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
రుద్రంగి: ఆది శ్రీనివాస్ నాలుగుసార్లు వేములవాడ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు! నాలుగుసార్లూ ఓడిపోయారు! ఇప్పుడు ఐదోసారి అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు! ప్రచారానికి సొంత గ్రామం రుద్రంగిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులు ‘‘ఒక్కసారి శీనన్న ముఖం చూడండి. నాలుగుసార్లు ఓడినా మన వెంటే ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా అండగా నిలిచారు. అధికారంలో లేకున్నా మన బతుకుల్లో వెలుగులు చూస్తూ ఆయన జీవితాన్ని మరిచిపోయారు. ఈసారైనా చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుందాం. ఇక్కడున్న తల్లులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు పాదాభివందనం చేస్తున్నాం. అందరినీ అర్థిస్తున్నాం. చేతులెత్తి మొక్కుతున్నాం’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో, రోడ్ షోకు హాజరైన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసిన అభ్యర్థి ఆది శ్రీనివాస్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.