Thummala Nageswara Rao: గొల్లగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న తుమ్మల
ABN , First Publish Date - 2023-11-30T07:51:21+05:30 IST
గొల్లగూడెంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ లో ప్రజాస్వామిక ప్రభుత్వం లేదని.. అవినీతి అరాచక పాలన సాగుతోందన్నారు.
ఖమ్మం : గొల్లగూడెంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ లో ప్రజాస్వామిక ప్రభుత్వం లేదని.. అవినీతి అరాచక పాలన సాగుతోందన్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితం చూసిన జిల్లా ప్రజానీకం కాంగ్రెస్‌కు పట్టం కడతారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించనుంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారని తుమ్మల తెలిపారు.