Share News

Thummala Nageswara Rao: మంత్రి అజయ్‌కు తుమ్మల సవాల్

ABN , First Publish Date - 2023-11-01T22:00:15+05:30 IST

మ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ( Minister Puvvada Ajay Kumar ) కు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సవాల్ విసిరారు.

Thummala Nageswara Rao: మంత్రి అజయ్‌కు తుమ్మల సవాల్

ఖమ్మం: ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ( Minister Puvvada Ajay Kumar ) కు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సవాల్ విసిరారు. బుధవారం నాడు ఖమ్మం లోని 10 వ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ...‘‘ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజయ్‌కు తుమ్మల సవాల్ విసిరారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాను. ఖమ్మంలో రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునిక ఖమ్మం గా ప్రగతి బాట పట్టించాను. ఈ ఐదేళ్ల పాలనలో ఖమ్మంలో కబ్జాలు దందాలు అవినీతి అరాచకం పెచ్చుమీరాయి. ఖమ్మం ప్రజానీకం మార్పు కోరుతుంది. యావత్ తెలంగాణలోనే ఖమ్మం కీర్తీ ప్రతిష్ఠ పెరిగేలా చేద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఆధునిక ఖమ్మంగా మార్చేలా హస్తం గుర్తుపై ఓటేయాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-01T22:00:15+05:30 IST