Share News

Yogi Adityanath: కాగజ్‌నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఏమన్నారంటే?...

ABN , First Publish Date - 2023-11-25T15:00:30+05:30 IST

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ బీజేపీ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

Yogi Adityanath: కాగజ్‌నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఏమన్నారంటే?...

కొమురం భీం: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ బీజేపీ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) పాల్గొని ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ (BJP) అధికారంలోకి రావాలన్నారు. బీఆర్ఎస్ (BRS) అంటే బ్రష్టాచార్ రిష్వత్ కోర్ సమితి అంటూ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ (CM KCR) స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 2017 కంటే ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttarpradesh) ఎలా ఉండేదో అందరికీ తెలుసని.. డబుల్ ఇంజిన్ సర్కార్ (Double Engine Sarkar) వచ్చాక ఒక్క రోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భం లేదన్నారు.

తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.పేపర్ లీకేజీల జరుగుతున్నాయని అన్నారు. మోడీ (PM Modi) 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. 6 లక్షలు ఇచ్చారని.. మిగతావి పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) రహస్య మిత్రులు అని.. వీరికి మధ్యలో ఎంఐఎం (MIM) ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని.. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రామ మందిరం నిర్మాణం జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీఎస్పీ (BSP) అందరి ఎజెండా ఒక్కటే అని చెప్పారు. సొంత రాష్ట్రం అయిన యూపీలోనే బీఎస్పీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-25T15:00:31+05:30 IST