Vikas Raj: అభ్యర్థులు అఫిడవిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి
ABN , First Publish Date - 2023-11-03T21:00:47+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) తెలిపారు. శుక్రవారం నాడు సీఈఓ కార్యాలయంలో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘బీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 16, బీజేపీ 5, బీఎస్పీ 3 ఎంసీసీ వైలేషన్ కింద FIRలు ఉన్నాయి. రైతు బంధుపై ఎలాంటి ప్రఫోజల్స్ రాలేదు. ప్రగతి భవన్ నోటీసుల అంశంలో ఈసీఐకి రిపోర్ట్ పంపాం. ఐటీ రైడ్స్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. 375 కంపెనీల కేంద్ర బలగాలు వస్తాయి. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనలో పోలీసులను రిపోర్ట్ అడిగాం. ఘటనకు పునావృతం కాకుండా అన్ని చర్యలు ఉంటాయని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.