Share News

Sharmila : కుక్క తోక తగిలితే కూలి పోయేలా కాళేశ్వరం దుస్థితి

ABN , First Publish Date - 2023-11-06T12:34:26+05:30 IST

రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని కాళేశ్వరం చేపట్టారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిస్థితి కుక్క తోక తగిలితే కూలి పోయేలా కాళేశ్వరం దుస్థితి ఏర్పడిందన్నారు.

Sharmila : కుక్క తోక తగిలితే కూలి పోయేలా కాళేశ్వరం దుస్థితి

హైదరాబాద్ : రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని కాళేశ్వరం చేపట్టారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిస్థితి కుక్క తోక తగిలితే కూలి పోయేలా కాళేశ్వరం దుస్థితి ఏర్పడిందన్నారు. అన్నారం పంపు హౌస్ , మేడిగడ్డ పరిస్థితిపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిగ్గు తేల్చారన్నారు. 20 అంశాలపై వివరణ అడిగితే 11అంశాలపై క్లారిటీ ఇచ్చారని షర్మిల పేర్కొన్నారు.

బ్యారేజ్ నిర్మాణమే వేస్ట్ అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. మేడిగడ్డ కు వచ్చిన ఇబ్బంది రాబోయే రోజుల్లో అన్నారం , సుందిళ్లకు ప్రమాదం రానుందని హెచ్చరించిందని తెలిపారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచారని షర్మిల వెల్లడించారు. సేమ్ ప్రాజెక్టు‌ను రాజ శేఖర్ రెడ్డి రూ.38 వేల కోట్ల తో నిర్మాణం చేయాలని భావిస్తే దానిని కేసీఆర్ లక్ష కోట్లకు పెంచి18లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్నారని తెలిపారు. కేసీఆర్ వైఎస్ కంటే కేవలం రెండున్నర ఎకరాలకు మాత్రమే పెంచారన్నారు. అసెంబ్లీ వేదికగా సాగునీటిపై అనేక అబద్ధాలు ఆడారని షర్మిల వెల్లడించారు.

Updated Date - 2023-11-06T12:34:28+05:30 IST