BJP MLA Etala: పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-06-27T17:57:44+05:30 IST
పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని, హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు.
హైదరాబాద్: పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని, హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు.
హైకమాండ్ పిలవకుండా ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదని, BRS తనను బయటకు వెళ్లగొడితే.. బీజేపీ అక్కున చేర్చుకుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో విజయ తీరాలను ముద్దాడేది బీజేపీనేనని ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు.
చాపకింద నీరులాగా పని చేసుకుంటూ వెళ్తున్నామని, 9 సంవత్సరాల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఈటెల రాజేందర్ చెప్పారు. ఎప్పుడూ ఒకేలాగా గ్రాఫ్ ఉండదని, తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందన్నారు. పార్టీ ఎదుగుదల కింది స్థాయి నుంచి రావాలని, బీజేపీకి కిందిస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.