Delhi: రోజూ బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయి.. బీఆర్‌ఎస్ ఎంపీ ముందు దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆవేదన

ABN , First Publish Date - 2023-06-21T15:51:16+05:30 IST

న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి పోరాటం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్‌ వద్ద ఎండను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసిన శేజల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. బుధవారం బీఆర్ఎస్‌ ఎంపీలను శేజల్ కలుసుకున్నారు. శేజల్, ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ కలిసి ఎంపీల వాహనానికి అడ్డుగా నిలిచి నిరసన వ్యక్తం చేశారు.

Delhi: రోజూ బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయి.. బీఆర్‌ఎస్ ఎంపీ ముందు దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆవేదన

న్యూఢిల్లీ: న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS MLA Durgam Chinnayya) బాధితురాలి పోరాటం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్‌ వద్ద ఎండను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసిన శేజల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. బుధవారం బీఆర్ఎస్‌ ఎంపీలను శేజల్ కలుసుకున్నారు. శేజల్, ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ కలిసి ఎంపీల వాహనానికి అడ్డుగా నిలిచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ ఎంపీ సురేష్‌ రెడ్డి (MP Suresh Reddy) కారు దిగివచ్చి శేజల్‌ను కలిసి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో తమకు న్యాయం చేయాలంటూ ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ.. ఏకంగా ఎంపీ సురేష్ రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దుర్గం చిన్నయ్య అనుచరుల నుంచి రోజూ బెదిరింపు మెసేజ్లు, ఫోన్లు వస్తున్నాయంటూ సురేష్ రెడ్డి ముందు శేజల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని.. తాను మాట్లాడతానని శేజల్‌కు ఎంపీ సురేష్ రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - 2023-06-21T15:51:16+05:30 IST