Priyanka Gandhi: ప్రియాంక గాంధీ పర్యటనలో మార్పులు

ABN , First Publish Date - 2023-05-07T16:21:27+05:30 IST

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) టూర్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ పర్యటనలో మార్పులు

హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) టూర్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం సా.3.30 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేటకు వస్తారు. బేగంపేట (Begumpet) నుంచి రోడ్డు మార్గాన ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి (Srikantachari) విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటారు. సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ (Congress) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. సభ ముగిసిన తర్వాత.. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.

ప్రియాంకగాంధీకి తెలంగాణలో ఇది తొలి రాజకీయ సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక.. ఆ రోజు తనకున్న టైట్‌ షెడ్యూల్‌లో అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించగలిగారు. ఒక విధంగా ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మొత్తంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ 45 నుంచి 50 నిమిషాలపాటు గడపనున్నట్లు వెల్లడించాయి. ప్రియాంక సభ జరిగే 8న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రోజుహైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాంగ్రెస్‌ నేతల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

Updated Date - 2023-05-07T16:21:27+05:30 IST