PAK VS NZ ODI: ఉప్పల్ స్టేడియంలో వరల్డ్‌కప్ మ్యాచ్‌పై గందరగోళం.. బీసీసీఐ నిర్ణయంపైనే క్రికెట్ అభిమానుల ఆశలు
ABN , First Publish Date - 2023-09-21T15:22:29+05:30 IST
ఉప్పల్ స్టేడియంలో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్(World Cup warm-up match) నిర్వహణపై గందరగోళం నెలకొంది.29వ తేదీన ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో పాకిస్థాన్ Vs న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.28వ తేదీన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీతో భద్రత ఇవ్వలేమని హెచ్‌సీఏ (HCA)కు పోలీసులు తెలిపారు.
ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్(World Cup warm-up match) నిర్వహణపై గందరగోళం నెలకొంది. 29వ తేదీన ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో పాకిస్థాన్ Vs న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈనెల 28వ తేదీన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీతో భద్రత ఇవ్వలేమని హెచ్‌సీఏ (HCA)కు పోలీసులు తెలిపారు. ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్ నిర్వహించేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించాలనుకుంటే... టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌కు భద్రత విషయంపై బీసీసీఐ(BCCI)కి హెచ్‌సీఏ (HCA)వివరించింది. BCCI నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని హెచ్‌సీఏ (HCA)తెలిపింది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ టికెట్లను హెచ్‌సీఏ(HCA) విక్రయించింది. బీసీసీఐ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. వరల్డ్ కప్‌లో భాగంగా ఉప్పల్‌లో 3 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్ వేదికగా అక్టోబర్ 3న ఆస్ట్రేలియా–పాక్ వార్మప్ మ్యాచ్, అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్, అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మ్యాచ్, అక్టోబర్ 10న పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ జరగనున్నాయి.
ముస్తాబు అవుతున్న ఉప్పల్ స్టేడియం
వన్డే వరల్డ్‌కప్ కోసం ఉప్పల్ మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియంలో సౌకర్యాలు, అభివృద్ధి కోసం బీసీసీఐ 110కోట్లు కేటాయించింది. ఉప్పల్ స్టేడియంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్త ఫ్లడ్ లైట్స్, ప్రేక్షకుల సీటింగ్, కొత్త రూప్‌టాప్స్, పెయింటింగ్స్, సీసీ కెమెరాలు, ప్రేక్షకుల సౌకర్యం కోసం మరో రెండు లిఫ్ట్‌లు రెడీ చేశారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్టేడియం అభివృద్ధి పనులు చేపడుతున్నారు.