Congress MLC: సీఎం కేసీఆర్‏పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్.. ఆయన ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-08-30T13:28:24+05:30 IST

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నిజమైన దళిత ద్రోహి అని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి(MLC T Jeevan Reddy) విమర్శించారు.

Congress MLC: సీఎం కేసీఆర్‏పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్.. ఆయన ఏమన్నారంటే..

సుభాష్‌నగర్‌(జగిత్యాల): తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నిజమైన దళిత ద్రోహి అని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి(MLC T Jeevan Reddy) విమర్శించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట సెకండ్‌ ఏఎన్‌ఎంలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సెకండ్‌ ఏఎన్‌ఎంలను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎన్‌ఎంలందరినీ రెగ్యులరైజ్‌ చేసి అవసరమైతే కొత్త పోస్టులను క్రియేట్‌ చేయాలన్నారు. వంద శాతం అర్హత ఉన్న ఏఎన్‌ఎంలకు రాత పరీక్షలో 20 శాతం వెయిటేజి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఏఎన్‌ఎంలు రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్‌(CM KCR)కు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ కింద సెకండ్‌ ఏఎన్‌ఎంలను నియమించామన్నారు.

knl2.jpg

కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు చేసిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పేరు మార్చి నేడు బస్తీ దవాఖాన అంటున్నారని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన నిధులు రూ.40వేల కోట్లు ల్యాప్స్‌ అవుతున్నాయన్నారు. దళితబంధు కోసం రూ.17,700 కోట్ల నిధులు కేబినెట్‌ ఆమోదం పొందాయని, అవి ఏమయ్యాయో చెప్పాలని ముఖ్యమంత్రిని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీ ఏమయిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ వారిది అర్రాస్‌ పాడినట్లుగా ఉందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అర్రాస్‌ పాడడం బీఆర్‌ఎస్‌కే అలవాటని జీవన్‌రెడ్డి ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈకార్యక్రమంలో సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, ముక్క భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-30T13:28:26+05:30 IST