Yadadri: యాదగిరికొండలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2023-05-21T20:00:45+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల (Devotees) సందడి నెలకొంది. వరుస సెలవుల నేపథ్యంలో నృసింహుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల (Devotees) సందడి నెలకొంది. వరుస సెలవుల నేపథ్యంలో నృసింహుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇష్టదైవాల దర్శనాల కోసం కొండపైకి చేరుకున్నారు. కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 40వేల మందికి పైగా భక్తులు లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారని దేవస్థాన అధికారులు తెలిపారు.
నృసింహుడిని శాస్త్రోక్తంగా నిత్యపూజలు
యాదగిరిగుట్ట (Yadagirigutta)లో కొలువైన లక్ష్మీనృసింహుడికి నిత్య పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్భాలయంలోని స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్పవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, నిత్య రుద్రహవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.50,96,399 ఆదాయం సమకూరింది.
భక్తుల ఇబ్బందులు
యాదగిరిక్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులు కొండపైన సౌకర్యాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండల ప్రభావంతో ఆలయ తిరువీధుల్లో బండలు కాలుతుండటంతో నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. దేవస్థాన అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల ఇక్కట్లు రెట్టింపవుతున్నాయి. రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, రద్దీ సమయాల్లో ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను నడపాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అస్వస్థతకు గురైతే ప్రథమ చికిత్సకు సైతం కొండపైన ఏర్పాట్లు లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన భక్తుడు రాజు ఆదివారం తన కుటుంబసభ్యులతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వచ్చాడు. కొండపైన బస్‌బే వద్దకు చేరుకున్న అతనికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి.