Kavitha: ఈడీ ఆఫీస్‌లో కవిత పరిస్థితి ఇది.. ఈ ఫొటోలే ఎందుకు వైరల్ అవుతున్నాయంటే..

ABN , First Publish Date - 2023-03-11T13:36:16+05:30 IST

‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో.. ఆ ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో..

Kavitha: ఈడీ ఆఫీస్‌లో కవిత పరిస్థితి ఇది.. ఈ ఫొటోలే ఎందుకు వైరల్ అవుతున్నాయంటే..

‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha ED Enquiry) హాజరయ్యారు. ఈడీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో.. ఆ ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో కనిపించిన ఆందోళన, భయానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బయటకు పిడికిలి బిగించి బీఆర్‌ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ధీమాగా కనిపిస్తున్నా.. అరెస్ట్ తప్పదనే నైరాశ్యం కవిత ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్లలో ఆ భయం కొట్టొచ్చినట్లు కనిపించిందని చెప్పడానికి తాజాగా వైరల్ అవుతున్న కవిత కళ్లకు సంబంధించిన ఫొటోలే కారణం.

kavithakka.jpg

ఇటీవల తెలంగాణ శాసనమండలిలో కూడా ఈ తరహా భయం, తత్తరపాటు కవితలో కనిపించాయి. శాసనమండలిలో కేటీఆర్, కవిత పక్కపక్కనే కూర్చుని సీరియస్‌గా మాట్లాడుకుంటున్న దృశ్యాలు లిక్కర్ స్కాం కేసులో కలవరపాటును బహిర్గతం చేశాయి. పైగా.. కేటీఆర్ శాసనమండలిలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ వెనుకే కూర్చున్న కవిత ఎంతో ముభావంగా కనిపించారు. ఆమె ముఖంలో భయం, తత్తరపాటు స్పష్టంగా కనిపించాయి.

kavitha.jpg

న్యాయపరంగా ముందుకెళ్లి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనే కసరత్తు చేసినా కవితకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యేలా తాజా పరిణామాలు ఉండటంతో ఆమెలో ఆందోళన మొదలైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వంటి పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో కవితలో కల్లోలం మరింత పెరిగింది. కవిత అరెస్ట్‌పై భయం ఆమెలోనే కాదు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో, నేతల్లో కూడా అలుముకుంది. రాత్రికి రాత్రే యాంటీ బీజేపీ పోస్టర్లు, యాంటీ మోదీ పోస్టర్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఢిల్లీకి కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.

Kavitha_f-removebg-preview.png

‘ఢిల్లీ మద్యం కుంభకోణం’ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కావడం, ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న మనీష్ సిసోడియాను కూడా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడంతో సహజంగానే కవిత ఈడీ విచారణపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పైగా.. కేటీఆర్, హరీష్ రావుతో పాటు తెలంగాణ మంత్రులంతా ఢిల్లీకి క్యూ కడుతుండటంతో హస్తినలో బీఆర్‌ఎస్ రాజకీయ వేడిని రాజేసింది. విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేస్తే మంత్రులంతా ధర్నా చేయాలనే వ్యూహంలో భాగంగానే హస్తినకు చేరుకుంటున్నట్లు తెలిసింది. కవిత ఈడీ విచారణకు వెళ్లి గంటలు గడుస్తుండటంతో అరెస్ట్ ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

kavitha.jpg

ఇక ఈడీ విచారణ ఎలా సాగుతోందంటే.. ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో మద్యం విధానం రూపకల్పనకు సంబంధించి జరిగిన సమావేశంలో కవిత పాల్గొన్నట్లు ఈడీ పలు సందర్భాల్లో కోర్టుకు తెలిపింది. కాగా, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్రు, అభిషేక్‌ బోయినల్లి, మాగుంట రాఘవరెడ్డితో పాటు ఇతరులతో ఉన్న వ్యాపార సంబంధాలు.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి హవాలా మార్గం ద్వారా చెల్లించిన ముడుపులు.. ఇండోస్పిరిట్స్‌ కంపెనీలో అరుణ్‌ పిళ్లై పేరిట ఉన్న 32.5 శాతం వాటాలు.. వంటి అంశాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం.

Updated Date - 2023-03-11T13:36:35+05:30 IST