Eatala Rajender: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు.. అదే నిజమైతే రాజీనామా చేస్తా
ABN , First Publish Date - 2023-09-07T17:32:42+05:30 IST
కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు. 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ సర్కార్‌కు ఈటల సవాల్ విసిరారు.
"అబిడ్స్ చౌరస్తా, అసెంబ్లీ ఎదురుగా, సచివాలయం ఎదురుగా ఎక్కడైనా 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని తేలితే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ చర్చకు రాకపోతే ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామనే తప్పుడు ప్రచారం మానుకోవాలి. మీ తప్పుడు ప్రచారం వాళ్ల ప్రజలు నవ్వుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం పట్టించారు. మంత్రులకు ఎవరికి స్వేచ్ఛ లేదు. ఉన్నా మంత్రులకు అవగాహన లేదు." అని ఈటల రాజేందర్ విమర్శించారు.