ED: తెలంగాణలో 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ తనిఖీలు

ABN , First Publish Date - 2023-06-21T20:12:36+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో 16 ప్రాంతాల్లో ఈడీ (ED) తనిఖీలు కొనసాగుతున్నాయి.

ED: తెలంగాణలో 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ తనిఖీలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 16 ప్రాంతాల్లో ఈడీ (Enforcement Directorate) తనిఖీలు కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు (PG Medical Seats) బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళోజీ వర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్లో వరంగల్‌లో కేసు నమోదు అయింది.

వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నాయని అభియోగం ఉంది. 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీల కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-06-21T20:19:26+05:30 IST