NCBN Arrest : సీబీఎన్‌ను సత్కరించాల్సింది పోయి జైలులో పెట్టడమా..!
ABN , First Publish Date - 2023-10-08T20:09:19+05:30 IST
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును సినీ నటుడు మురళీమోహన్ (Film actor Murali Mohan) ఖండించారు.
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును సినీ నటుడు మురళీమోహన్ (Film actor Murali Mohan) ఖండించారు. మాదాపూర్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పారు.
గ్రహణం ఎన్నో రోజులు ఉండదు!
"అభివృద్ధి చేసిన వ్యక్తిని సత్కరించాల్సింది పోయి జైలులో పెట్టడం బాధాకరం. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మాత్రమే కాదు.. దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడికి గ్రహణం పట్టింది, గ్రహణం ఎక్కువ రోజులు ఉండదు. జైల్లో పెట్టామని ఆనందపడటం కాదు.. ప్రజల్లో సానుభూతి పెరిగింది. కడిగిన ముత్యంలా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తాడు. మంచి నాయకుడు అధికారంలోకి రావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చూస్తాం" అని మురళిమోహన్ అన్నారు.
కాగా.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందానగర్ డీవీజన్ సప్తగిరి కాలనీ నుంచి వివేకానంద నగర్ NTR విగ్రహం వరకు మహిళలు, చంద్రబాబు అభిమానులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు.
హైదరాబాద్ చంద్రబాబుకు సంఘీభావంగా బీహెచ్ఈఎల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీతో నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలకతీతంగా భారీగా చంద్రబాబు మద్దతుదారులు ర్యాలీలో పాల్గొన్నారు. వెంటనే బాబును విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.