Share News

High Court: రాజేంద్రనగర్‌లో హైకోర్టు.. స్థానికుల హర్షం

ABN , Publish Date - Dec 15 , 2023 | 07:29 AM

రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో హైకోర్టు(High Court) భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో

High Court: రాజేంద్రనగర్‌లో హైకోర్టు.. స్థానికుల హర్షం

రాజేంద్రనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో హైకోర్టు(High Court) భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించడంపై ఆనందం వెలిబుచ్చుతున్నారు. రాజేంద్రనగర్‌ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే రహదారిలో ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో గల మానస హిల్స్‌లో హైకోర్టు భవనం నిర్మించాలని గత ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్లో హైకోర్టు భవనం కట్టడానికి కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు చర్చ వచ్చినట్లు తెలిసింది. హైకోర్టు న్యాయమూర్తులు ఈ స్థలానికి ఓకే చెబితే జనవరిలోనే శంకుస్థాపన జరగనుంది.

Updated Date - Dec 15 , 2023 | 07:29 AM