HMDA : భూముల వేలానికి సంబంధించి మరో నోటిఫికేషన్.. గజం ధర హయ్యస్ట్ ఎంతో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-08-10T10:53:25+05:30 IST
హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. కోకాపేట భూముల వేలం కావల్సినంత జోష్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి ప్రాంతాల వారీగా భూములను వేలం వేస్తోంది. నేడు భూముల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డిలో 8, మేడ్చల్ లో 8, సంగారెడ్డిలో 10 ల్యాండ్ పార్సెల్స్ రెడీగా ఉన్నాయి.
హైదరాబాద్ : హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. కోకాపేట భూముల వేలం కావల్సినంత జోష్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి ప్రాంతాల వారీగా భూములను వేలం వేస్తోంది. నేడు భూముల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డిలో 8, మేడ్చల్ లో 8, సంగారెడ్డిలో 10 ల్యాండ్ పార్సెల్స్ రెడీగా ఉన్నాయి. ఈ నెల 16 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు విధించింది. ఆగస్టు 18న రెండు సెషన్స్‌లో హెచ్ఎండీఏ ఆన్లైన్ వేలం వేయనుంది. 300 గజాల నుంచి 8,590 గజాల వరకు ఓపెన్ ప్లాట్లను హెచ్ఎండీఏ రెడీ చేసింది. ఆయా జిల్లాల్లో ఏరియాని బట్టి కనీస నిర్దేశిత ధర వేర్వేరుగా ప్రకటించింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నల్లగండ్లలోని ప్లాట్లకు గజానికి 65 వేలు కేటాయించింది.
హైదరాబాద్ పరిధిలోని బుద్వేల్‌లో 100 ఎకరాల వేలానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది. దీనికి సంబంధించి నేడు వేలం ప్రక్రియ కొనసాగనుంది. బుద్వేల్‌లో 14 ప్లాట్స్ ఈ-వేలానికి సన్నద్ధమైంది. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర ఎకరానికి 20 కోట్లుగా ఉంది. ల్యాండ్ పార్శిల్ ప్యాకేజీలో మూడున్నర ఎకరాల నుంచి 14 ఎకరాల వరకు విక్రయించేందుకు సర్కారు నిర్ణయించింది. కోకాపేట నియోపోలీస్ లే ఔట్ నుంచి 15 నిమిషాల ప్రయాణం పడుతుందని ప్రభుత్వం తెలిపింది.