HYD: కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాం.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి కూడా ఓడిపోతారు..
ABN , First Publish Date - 2023-10-17T10:58:37+05:30 IST
దొడ్డిదారిలో టికెట్ తెచ్చుకున్న పరమేశ్వర్‌రెడ్డి(Parameshwar Reddy)ని ఉప్పల్‌లో ఓడిస్తామని, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కూడా
- రేవంత్‌రెడ్డి బాధితులందరికీ అండగా ఉంటాం..
- పార్టీకి రాజీనామా చేసిన రాగిడి లక్ష్మారెడ్డి, జితేందర్‌రెడ్డి
ఉప్పల్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): దొడ్డిదారిలో టికెట్ తెచ్చుకున్న పరమేశ్వర్‌రెడ్డి(Parameshwar Reddy)ని ఉప్పల్‌లో ఓడిస్తామని, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కూడా ఓడిపోతారని సీనియర్ నాయకుడు రాడిగి లక్ష్మారెడ్డి(Radigi Lakshmareddy) అన్నా రు. తనకు ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ కేటాయించకపోవడంతో రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్న సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డికి కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన పీసీసీ మాజీ కార్యదర్శి పూడూరు జితేందర్‌రెడ్డి తోడయ్యారు. వీరితో పాటు మరో 15 మంది సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ‘సీటుకు రేటు కట్టి అంగట్లో అమ్ముకుంటున్నావని, ప్రస్తుతం ప్రకటించిన సీట్లలో నీ వాటా ఎంత ప్రకటించబోయే రెండో జాబితలో రాబోయే వాటా ఎంతో రేవంత్‌రెడ్డి చెప్పాలి’ అని రాడిగి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనలా దగాపడ్డ కాంగ్రెస్ నాయకులందరికీ తాను అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.
పూడూరు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పీసీసీ పదవికి అనర్హుడని, ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా దొరికిన రేవంత్‌రెడ్డి ఇప్పుటు సీటుకు నోటు అంటూ ప్రతి సీటుకు రేటును నిర్ణయించి అమ్ముకుంటున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి హోల్‌సేల్‌గా కొని రిటైల్‌గా అమ్ముకుంటున్నాడన్నారు. తన మనుషులను పెట్టుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని ఫ్రాంచైజ్ ఇచ్చి వారి నుంచి నెలనెలా రాయల్టీ తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీనీ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని ఆరోపించారు.
పరమేశ్వర్‌రెడ్డిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఉప్పల్‌లో సీనియర్లందరిని అవమానించి ఓడిపోయే వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో పరమేశ్వర్‌రెడ్డిని ఓడించేందుకు వైఎస్ఆర్ మిత్రమండలి కృషి చేస్తుందని, ఆయన ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు.