Share News

HYD: ఎమ్మెల్యే మాగంటి ఆసక్తికర కామెంట్స్.. ‘గ్రేటర్‌’లో అన్ని స్థానాల్లో గెలుస్తాం..

ABN , First Publish Date - 2023-10-20T08:27:10+05:30 IST

గ్రేటర్‌లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ హైదరబాద్‌ జిల్లా అధ్యక్షుడు

HYD: ఎమ్మెల్యే మాగంటి ఆసక్తికర కామెంట్స్.. ‘గ్రేటర్‌’లో అన్ని స్థానాల్లో గెలుస్తాం..

బంజారాహిల్స్‌/వెంగళరావునగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ హైదరబాద్‌ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గేంచేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్లైఓవర్‌ పనులు ప్రారంభించి పూర్తి చేసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉప్పల్‌, అంబర్‌పేటలో ప్లైఓవర్‌ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తోన్నా ఇంకా పూర్తి చేయలేదని ఎమ్మెల్యే మాగంటి ఎద్దేవా చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ(Congress, BJP)లకు అభ్యర్ధులు కరువయ్యారన్నారు. ఎన్నికలు రాగానే బయటకు వస్తున్న ప్రతిపక్ష నాయకులు, కరోనా సమయంలో ఎక్కడి పోయారని ప్రశ్నించారు. కరెంటు కష్టాలు, తాగునీటి ఇబ్బందులు, ట్రాఫిక్‌ ఆటంకాలను అధిగమిస్తూ పాలన సాగిందన్నారు. శాంతిభద్రతల విషయంలో పటిష్ఠంగా ఉండాలని కొత్తగా 23 కొత్త పోలీసుస్టేషన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. నగర పరిధిలో ఇప్పటికే లక్ష డబుల్‌ బెడ్‌రూంలు అర్హులకు అందజేశామని, మరో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించనున్నట్టు ఎమ్మెల్యే గోపీనాథ్‌ వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన మధురానగర్‌ యువత

వెంగళరావు నగర్‌ డివిజన్‌ మధురా నగర్‌ కాలనీ చెందిన యువత మినుకూరి శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్యర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా, వారికి గులాబి కండువా ఆహ్మానించారు. కార్యక్రమంలో కార్పొరేట్టర్‌ దేదీప్య, నాయకులు రామకృష్ణ, దేవిరెడ్డి నాగార్జున రెడ్డి తదితరులుపాల్గొన్నారు.

ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు : ఎమ్మెల్యే

బోరబండ, (ఆంధ్రజ్యోతి): రెహ్మత్‌నగర్‌ డివిజన్‌ను తొమ్మిదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసి నియోజక వర్గంలో ముందు వరసలో ఉంచామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పేర్కొన్నారు. గురువారం బ్రహ్మశంకర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. పాదయాత్రలో ప్రజల నుంచి మద్దతు లబిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ సీఎన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు నజీర్‌, నాగరాజు, కృష్ణ, పరుశరాము, ధనుజ తదితరులు పాల్గొన్నారు.

YYY.jpg

Updated Date - 2023-10-20T08:27:10+05:30 IST