Hyderabad ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు మూసివేత.. వీలైనంత తొందరగా..

ABN , First Publish Date - 2023-07-27T13:47:04+05:30 IST

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు 2, 7 ఎగ్జిట్ పాయింట్లను అధికారులు మూసివేశారు. నీరు నిలవడంతో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు 2, 7 ఎగ్జిట్ పాయింట్ల మూసివేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకంటించారు. వీలైనంత తొందరగా తిరిగి తెరుస్తామని అర్వింద్ కుమార్ ప్రకంటించారు.

Hyderabad ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు మూసివేత.. వీలైనంత తొందరగా..

హైదరాబాద్ : నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు 2, 7 ఎగ్జిట్ పాయింట్లను అధికారులు మూసివేశారు. నీరు నిలవడంతో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు 2, 7 ఎగ్జిట్ పాయింట్ల మూసివేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకంటించారు. వీలైనంత తొందరగా తిరిగి తెరుస్తామని అర్వింద్ కుమార్ ప్రకంటించారు.

ఇదిలా ఉండగా.. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ మహానగర మణిహారమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) గుంతలమయంగా మారింది. భారీ వాహనాలు వెళ్లే 3,4 లేన్లలో అడుగడుగునా గుంతలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ వాహనాలు కార్లు వెళ్లే 1, 2 లేన్లలోకి వస్తుండడంతో ప్రమాదాలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకధాటి వర్షాలకు అధిక లోడ్‌తో వస్తున్న భారీ వాహనాలు తోడై 3, 4 లేన్లలో బీటీ (తారు) మొత్తం లేచిపోతోంది. భారీ వర్షాలతో రోడ్డు ఎక్కడికక్కడ ధ్వంసమైంది. 158 కిలోమీటర్ల నిడివి ఓఆర్‌ఆర్‌ ఇరువైపులా కలిపి 316 కిలోమీటర్లు కాగా, ఇందులో 100 కిలోమీటర్ల మినహా మిగతాది దెబ్బతిన్నది. కోకాపేట నుంచి గచ్చిబౌలి, కొల్లూరు నుంచి పటాన్‌చెరు, ఘట్‌కేసర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట, కండ్లకోయ నుంచి పటాన్‌చెరు వరకు గుంతలతో నిండిపోయింది.

పెరిగిన భారీ వాహనాల తాకిడి

ఓఆర్‌ఆర్‌పై రోజూ 1.30 లక్షల వరకు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. భారీ లోడ్‌ వాహనాలు కొన్ని ఓఆర్‌ఆర్‌ ఎక్కుతుండగా, మరికొన్ని ఎక్కడం లేదు. దీనికి కారణం టోల్‌ ఫీజుతో పాటు ఇంధన ఖర్చు కూడా ఎక్కువ అవుతుండడం! ఓఆర్‌ఆర్‌ ఎక్కకుండా వాహనాలను విజయవాడ, ముంబై, నాగ్‌పూర్‌, బెంగళూరు మార్గాల్లో నిలుపుతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదు. రాత్రి 10 గంటల తర్వాత నగ రం లోపలి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. దీనివల్ల టోల్‌ చార్జీతో పాటు ఇంధన భారం కూడా తప్పుతోంది. అయితే వర్షాలతో నగరంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండడంతో భారీ వాహనాలన్నీ ఓఆర్‌ఆర్‌ ఎక్కుతున్నాయి. వాటి తాకిడి ఎక్కువైంది.

1, 2 లేన్లలోకి రావడంపై ఆందోళన

ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో 3, 4 లేన్లలోనే ప్రయాణించాలి. అవి తేలికపాటి వాహనాలు, కార్లు వెళ్లే 1, 2 లేన్లలోకి రాకూడదనే నిబంధన ఉంది. అయితే 3, 4 లేన్లలో పడిన గుంతలను తప్పించుకోవడానికి కొన్ని భారీ వాహనాలు 1, 2 లేన్లలోకి వస్తున్నాయి. దాంతో 1, 2 లేన్లలో గంటకు 120కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. 3, 4 లేన్లలో దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-07-27T14:06:42+05:30 IST