Share News

Hyderabad : నాంపల్లిలో పెను విషాదం..9 మంది మృతి.. కేటీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన : లైవ్ అప్డేట్స్

ABN , First Publish Date - 2023-11-13T13:54:58+05:30 IST

Hyderabad Nampally Fire Accident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad : నాంపల్లిలో పెను విషాదం..9 మంది మృతి.. కేటీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన : లైవ్ అప్డేట్స్

03:20 PM : అత్యంత బాధాకరం

  • ఉస్మానియా మార్చురీ దగ్గర మీడియాతో మాట్లాడిన నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్

  • అగ్నిప్రమాద మృతుల బంధువులను పరామర్శించిన హుస్సేన్

  • ఇవాళ ఉదయం 9 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది

  • 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం

  • మంటలు ఎక్కువ కావడంతో అపార్టుమెంట్‌లో ఉన్నవారు కిందికి రావడానికి భయపడ్డారు

  • సెల్లార్‌లో కెమికల్ గోడౌన్ ఉంది.. దాంతో మంటలు ఎక్కువయ్యాయి

  • ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం బాధాకరం

  • నాలుగో ఫ్లోర్‌లో ఉన్నవారు బిల్డింగ్‌పైకి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు

  • మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

  • ఈ అగ్నిప్రమాదానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాను

Post-Martem.jpg

03:20 PM : అత్యంత బాధాకరం..

  • నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి

  • అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి

  • అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి

  • మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

  • అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి

  • కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తల దాడిని ఖండిస్తున్నాను

Bhattivikramarka.jpg

03:10 PM : పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశం

  • నాంపల్లి ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి

  • అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని

  • అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు

  • ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కేటీఆర్‌ ఆదేశాలు

  • షార్ట్‌ సర్య్కూట్‌ లేదా టపాసుల వల్ల మంటలు వ్యాప్తించి ఉండొచ్చు!

  • ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలి

  • అగ్ని ప్రమాదాల నివారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం

  • ఒక్కో మృతుడి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

  • బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని హామీ

  • అపార్ట్‌మెంట్‌లో కెమికల్స్‌ వాడటం ప్రమాదకరం

KCR.jpg

02:50 PM : నాంపల్లి ఘటనపై పవన్ దిగ్భ్రాంతి

  • నాంపల్లి అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికరం

  • మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

  • 9 మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా

  • ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా

  • గాయాల పాలైనవారికీ, అస్వస్థతకు గురైన వారికీ మెరుగైన వైద్య సేవలు అందించాలి

  • భవనాల్లో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్లే ఈ ఘోరం చోటు చేసుకొందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది

  • నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చేవాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలి

pawan-nampally.jpg

02:45 PM : మృతదేహాల పరిశీలన

  • అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించిన నాంపల్లి ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్

  • ఉస్మానియా మార్చురీలో మృతదేహాలు

  • సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్‌ను కలిసి మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని కోరిన హుస్సేన్

  • మృతుల వివరాలను పంచనామాలో పొందుపరిచామన్న పోలీసులు

  • సాయంత్రం 5 గంటల వరకు మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వారి బంధువులకు అప్పగిస్తామని చెబుతున్న పోలీసులు

  • మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న మాజీద్ హుస్సేన్

  • మరో అరగంటలో ప్రారంభం కానున్న పోస్టుమార్టం

Post-Martem-Pariseelana.jpg

02:30 PM : ఎంతో ట్రై చేశాం కానీ..? (Exclusive)

నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్ ఆదర్శ్ మీడియాకు వివరించారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో (ABN-Andhrajyothy) ఆదర్శ మాట్లాడుతూ... నాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్నవారిని రెస్క్యూ చేసినట్లు తెలిపారు. తమ చేతులతో 21 మందిని రెస్క్యూ చేశామన్నారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్‌కు తరలించినట్లు ఫైర్ మాన్ వెల్లడించారు.

Rescue.jpg

రెండో అంతస్థులో ఉన్న ఆరు మంది పొగపీల్చి అపస్మారకస్థితిలోకి వెళ్లారని.. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారన్నారు. మూడు, నాలుగు అంతస్థుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారని.. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా ఉన్నాయన్నారు. ఆ పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారన్నారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశామని.. కానీ దురదృష్టశాత్తు ప్రాణాలు పోయాయని తెలిపారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించామని ఆదర్శ్ వెల్లడించారు.

namfire-adarsh.jpg

02:18 PM : ఎక్స్‌గ్రేషియా

  • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం: కేటీఆర్‌

  • ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం: కేటీఆర్‌

  • మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతి: కేటీఆర్‌

Nampally-Building.jpg

02:00 PM : ప్రమాద స్థలికి మంత్రి కేటీఆర్‌

  • ప్రమాద వివరాలపై మంత్రి కేటీఆర్‌ ఆరా

  • ఘటనా స్థలాన్ని సందర్శించిన కేటీఆర్‌, తలసాని

Ktr-and-Talasani.jpg

01:45 PM : లాఠీచార్జ్‌

  • బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదం స్థలం దగ్గర లాఠీచార్జ్‌

  • ఘటనాస్థలిలో కాంగ్రెస్‌, MIM వర్గాల మధ్య ఘర్షణ

  • నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ బాధితులను పరామర్శించి..

  • వెళ్తున్న సమయంలో అడ్డుకున్న MIM కార్యకర్తలు

  • లాఠీచార్జ్ చేసి అదుపుచేసిన పోలీసులు

01:35 PM : క్లూస్ టీమ్

  • నాంపల్లి ఘటనాస్థలికి క్లూస్ టీం

  • ఘటనాస్థలిలో క్లూస్ సేకరిస్తున్న క్లూస్ టీం

  • కెమికల్ డ్రమ్ముల నుంచి క్లూస్ సేకరించిన క్లూస్ టీం

Dabba.jpg

01:25 PM : బిల్డింగ్ ఓనర్ ఎవరు..?

  • నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదం కేసు

  • భవన యజమాని రమేష్ జైస్వాల్‌గా గుర్తింపు

  • 5 అంతస్తుల భవనంలో భారీగా కెమికల్ డబ్బాలు నిల్వచేసిన రమేష్ జైస్వాల్

  • రమేష్ జైస్వాల్‌కి ప్లాస్టిక్ తయారుచేసే పరిశ్రమ ఉన్నట్లుగా గుర్తింపు

  • గ్రౌండ్ ఫ్లోర్‌లో పెద్దఎత్తున కెమికల్స్ నిల్వచేసిన రమేష్

  • 150 పైగా కెమికల్ డబ్బాలను నిల్వచేసిన రమేష్ జైస్వాల్

  • గ్రౌండ్ ఫ్లోర్‌లో కెమికల్ డబ్బాలో ఒకసారిగా అగ్నిప్రమాదం..

  • కెమికల్ డబ్బాల లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా భవనాన్ని వ్యాపించిన మంటలు..

  • మంటల్లో ఒకరిబిక్కిన అద్దె కుంటున్న జనాలు..

  • ఒకటి రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని తెలి పిన పోలీసు అధికారులు..

  • మూడు నాలుగు అంతస్తులో ఉన్నవాళ్లు సేఫ్ గా ఉన్నారని తెలిసిన పోలీసులు..

  • మూడు నాలుగు రక్షించిన పోలీసు అధికారులు

  • దట్టమైన పొగలు తో ఊపిరాడక చనిపోయిన వారు

  • మంటలో మరికొందరు సజీవమైనట్లుగా గుర్తింపు

  • చనిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళుగా అనుమానిస్తున్న పోలీసులు

  • భవనంలో డీజిల్ పెట్రోల్ ఆయిల్ లేదని తెలిసిన పోలీసులు

  • మంటలకు కెమికల్ డబ్బాలే కారణమని తెలిసిన పోలీసులు

Buildng.jpg

01:15 PM : ఎవరు వారంతా..?

  • హైదరాబాద్‌ బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదం

  • అపార్ట్‌మెంట్‌లో ఉండేవారంతా అద్దెకు ఉండేవాళ్లే

  • అపార్ట్‌మెంట్‌ యజమాని రమేష్ జైస్వాల్‌కు నగరంలో పలు కెమికల్ ఫ్యాక్టరీలు

  • అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్‌లో అక్రమంగా కెమికల్ డ్రమ్స్ నిల్వ

  • సెల్లార్‌ నుంచి మొదటి, రెండో అంతస్తుకు వ్యాపించిన మంటలు

  • పరారీలో అపార్ట్‌మెంట్‌ యజమాని రమేష్‌ జైస్వాల్‌

nampally-fire.jpg

12:35 PM : మృతులు వీరే..

  • నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంలో 9కి చేరిన మృతులు

  • ఆస్పత్రిలో 10 మందికి చికిత్స

  • చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరు పరిస్థితి విషమం

  • ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

  • మృతులు అజం (58), రెహానా (50), సమీన్‌ (26),..

  • తహూరా (35), తూబ (6), తరూబా (13),..

  • జకీర్ హుస్సేన్‌ (66), నికత్‌ సుల్తానా (55), హసీబ్‌ (32)

12:30 PM : ఏం జరిగింది..?

  • నాంపల్లి ఘటనాస్థలికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ నుంచి వివరాలు అడిగిన కిషన్‌రెడ్డి

Kishan-Reddy.jpg

12:20 PM : ప్రమాదాలకు నిలయంగా హైదరాబాద్

  • నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

  • హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది

  • వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్న ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది

  • ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం

  • అపార్ట్మెంట్ సెల్లర్ లో కారు మరమ్మతులు ఏంటి?

  • రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిలువ చేశారు?

  • ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి

  • మృతులకు ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

  • మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

REVANTH.jpg

12:15 PM : సీఎం సంతాపం :

  • నాంపల్లి బజార్‌ఘాట్‌ అగ్ని ప్రమాదంపై కేసీఆర్ దిగ్ర్భాంతి

  • మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం

  • తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం

  • గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలి: సీఎం కేసీఆర్‌

kcr-fire.jpg

12:00 PM : సమీక్ష

  • నాంపల్లి బజార్‌ఘాట్‌ ప్రమాదస్థలికి పోలీసు ఉన్నతాధికారులు

  • ఘటనాస్థలికి అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ శ్రీనివాస్‌

  • పరిస్థితిని సమీక్షిస్తున్న అడిషనల్‌ సీపీ, జాయింట్‌ సీపీ శ్రీనివాస్‌

nagireddy-dgp.jpg

11:40 AM : అసలేం జరిగింది..?

  • బజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై ఫైర్ డీజీపీ నాగిరెడ్డి ప్రకటన

  • మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చాం: నాగిరెడ్డి

  • అగ్నిప్రమాదంలో సుమారు 21 మందిని రక్షించాం: నాగిరెడ్డి

  • 21 మందిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు: నాగిరెడ్డి

  • మొత్తం మృతులు ఏడుగురు: ఫైర్ డీజీపీ నాగిరెడ్డి

  • జనావాసాల మధ్య కెమికల్ డ్రమ్ములను ఉంచారు: నాగిరెడ్డి

  • ఆ డ్రమ్ములే అగ్ని ప్రమాదానికి కారణం: ఫైర్ డీజీపీ నాగిరెడ్డి

  • జనావాసాల మధ్య కెమికల్ డ్రమ్ముల నిల్వకు అనుమతిలేదు: నాగిరెడ్డి

namp-fire1.jpg

10 : 23 AM : నాంపల్లిలో ఘోరం :

  • హైదరాబాద్‌‌‌లోని నాంపల్లి బజార్ ఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం

  • ప్రమాదంలో ఏడుగురు మృతి

  • మంటల్లో చిక్కుకుని సజీవ దహనం

  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

  • మంటల్లో చిక్కుకున్న పలువురు అపార్ట్‌మెంట్ వాసులు

  • 3 ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది

  • కెమికల్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు

  • నాలుగు అంతస్తులకు వ్యాపించిన మంటలు

  • పలు వాహనాలు దగ్ధం, అగ్నికి ఆహుతైన కార్లు, బైక్‌లు

Nampally.jpg

Updated Date - 2023-11-13T16:02:58+05:30 IST