Hyderabad Metro: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపరాఫర్

ABN , First Publish Date - 2023-08-11T17:38:51+05:30 IST

నగరంలోని మెట్రో ప్రయాణికులకు(metro Passengers) ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌(L&T Metro Rail Hyderabad) సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Hyderabad Metro: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపరాఫర్

హైదరాబాద్(Hyderabad): నగరంలోని మెట్రో ప్రయాణికులకు(metro Passengers) ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌(L&T Metro Rail Hyderabad) సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్‌(Super Saver Freedom Offer)ను తీసుకొచ్చింది. భారతదేశపు 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా HMR ప్రయాణికులకు ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఇవ్వనున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది. ఈ బంపర్ ఆఫర్ ఆగస్ట్ 12, 13, 15 తేదీల్లో అందుబాటులోకి వస్తోందని చెప్పింది. ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం 59 రూపాయలతో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. 59 రూపాయల రీఛార్జ్‌తో వీకెండ్‌ను ఆస్వాదించడానికి అనువుగా ఉండడంతో పాటు అపరిమిత మెట్రో రైడ్లు చేసే అవకాశం ఉంటుంది. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది.

Updated Date - 2023-08-11T17:47:15+05:30 IST