Swapnalok Fire Accident: స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-03-17T13:14:50+05:30 IST

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై మహాంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు.

Swapnalok Fire Accident: స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై కేసు నమోదు

హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద (Swapnalok Fire Accident) ఘటనపై మహాంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. 49/2023 U/s 304 పార్ట్-II, 324, 420 ఐపీసీ, సెక్షన్.9 (బి) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసు నమోదు అయ్యింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ సూపర్‌వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి 7:15 గంటలకు కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. కీడియా ఇన్ఫోటెక్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్ నుంచి మంటలు, పొగలు వస్తున్నట్లు గుర్తించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ భవనంలో 5వ అంస్తులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనస్థలికిఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకుచ్చి పలువురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. అనంతరం పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో వివిధ ఆసుపత్రులకు తరలించారు.

క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు మిస్ అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 5వ అంతస్తులో వారిని గుర్తించి వెంటనే గాంధీకి తరలించారు. వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టర్ పొగ వల్లే చనిపోయారని నిర్ధారించారు. ఈ క్రమంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-17T13:14:50+05:30 IST