TS News: కనీసం వేతనం కోసం కదం తొక్కిన అంగన్ వాడీలు

ABN , First Publish Date - 2023-09-20T16:28:01+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో కనీసం వేతనం కోసం అంగన్ వాడీలు కదం తొక్కారు. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. పలు జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

TS News: కనీసం వేతనం కోసం కదం తొక్కిన అంగన్ వాడీలు

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కనీసం వేతనం కోసం అంగన్ వాడీలు (Angan wadis) కదం తొక్కారు. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. పలు జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు (Police) అరెస్టు (Arrest) చేశారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదని అంగన్ వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముట్టడికి పెద్దఎత్తున తరలి వచ్చారు. గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవని.. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంగన్ వాడీ కార్యకర్తలు హెచ్చరించారు.

అలాగే అదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనలతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కోసం కొద్ది రోజులుగా అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. బుధవారం కలెక్టరేట్లను ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్ వాడీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులను చుట్టిముట్టి కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళన కారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కనీస వేతనం రూ. 25వేలతోపాటు ఇతర సమస్యల పరిస్కారం కోసం సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోగా పోలీసులతో అణచివేస్తోందని కార్యకర్తలు ఆరోపించారు.

Updated Date - 2023-09-20T16:28:01+05:30 IST