Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ మరో పిటిషన్

ABN , First Publish Date - 2023-04-06T12:32:21+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్టుపై బీజేపీ లీగల్ సెల్ (BJP Legal Cell) హైకోర్టు (High Court)లో మరో పిటిషన్ (Petition) వేశారు.

Bandi Sanjay: తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ మరో పిటిషన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్టుపై బీజేపీ లీగల్ సెల్ (BJP Legal Cell) హైకోర్టు (High Court)లో మరో పిటిషన్ (Petition) వేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు రానుంది. సంజయ్‌పై దాదాపు 11 సెక్షన్లు పెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ రిమాండ్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ తరఫున బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు. ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరుపుతామని చీఫ్ జస్టస్ చెప్పారు.

నిన్న హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) దాఖలు చేసిన నేపథ్యంలో ఇది కూడా చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ ఉంది. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, సీఆర్పీసీ 50 కింద ప్రొసీజర్ ఫాలో కాకుండా పోలీసులు అనైతికంగా ప్రవర్తించారంటూ ఫిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవాళ లంచ్ మోషన్‌లో ఈ అంశాలన్ని ప్రస్తావన చేస్తూ వాదనలు వినిపించే అవకాశం ఉంది.

మరోవైపు హనుమకొండ కోర్టు (Hanumakonda Court) విధించిన రిమాండ్‌ను రిజెక్టు చేయాలని కూడా పిటషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై వాదనలు విన్న తర్వాత లంచ్ మోషన్‌కు సంబంధించిన అంశంపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా నిన్న వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ గురువారం మధ్యాహ్నం 2-30 గంటలకు విచారణ జరగనుంది. టెన్త్ పేపర్ లీకేజీ తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో బండి సంజయ్‌ను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

బండి సంజయ్ లంచ్ మోషన్‌లో కీలక అంశాలు..

- హనుమకొండ కోర్ట్ ఇచ్చిన డాకెట్ ఆర్ధర్ సస్పెండ్ చేయాలి

- తక్షణమే సంజయ్‌ను విడుదల చేయాలి

- అరెస్ట్ సమయంలో పోలీసులు 41-ఎ నోటీస్ ఇవ్వలేదు

- అరెస్టు సమయంలో పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు -

- కరీంనగర్ నుండి 150 కిలోమీటర్లు దూరం లో ఉన్న బొమ్మలరామారంకు తరలించారు

- బొమ్మలరామారంకు ఎందుకు తరలించారో తెలియదు.

- ఇదే బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌పై గతంలో నక్సలైట్లు దాడి చేశారు

- రాత్రంతా బొమ్మలరామారం పిఎస్‌లోనే అక్రమంగా నిర్బంధించారు

- వైద్య పరీక్షల కోసం బొమ్మలరామారం నుండి 70 కిలోమీటర్ల లో ఉన్న పాలకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు

- పాలకుర్తి నుండి మళ్లీ హన్మకొండకు తరలించారు

- కరీంనగర్ నుండి వరంగల్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరం ఉంది

- వేధింపులకు గురి జేయాలనే కిలోమీటర్ల కొద్ది తిప్పారు

- వరంగల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారు

- బీజేపీపై కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారు

- రిమాండ్ రిపోర్టులో సైతం నేరం చేసినట్టు ఎక్కడ పొందపర్చ లేదు

- అరెస్టు సమయంలో సిఆర్పిసి 50 నిబంధనలను పోలీసులు పాటించలేదు

- పోలీస్ కస్టడీలోనూ దురుసుగా ప్రవర్తించారు

- మొన్న రాత్రి అరెస్టు చేస్తే నిన్న సాయంత్రం 6:02 కు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు

- బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు పోలీసులు ప్రవర్తిస్తున్నారు

- హనుమకొండ కోర్ట్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలి

Updated Date - 2023-04-06T12:39:37+05:30 IST