T.Elections 2023: తెలంగాణ ఎన్నికల నిర్వహణపై సీఈసీకి సుప్రీం న్యాయవాదుల విజ్ఞాపనలు
ABN , First Publish Date - 2023-10-19T15:21:50+05:30 IST
తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు విజ్ఞాపనలు పంపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు, కేసులను ఈసీ పరిశీలించాలని, ఎన్నికల నియమావళి అభ్యర్థులు సక్రమంగా అమలయ్యేలా చూడాలని విజ్ఞాపనలు అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆదాయాలు, ఇప్పుడు ఐదేళ్లలో విపరీతంగా పెరిగాయని వాటిని పరిశీలించాలని కోరారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల నిర్వహణపై (Telangana Elections 2023) కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) సుప్రీంకోర్టు న్యాయవాదులు (Supreme Court Advocates) విజ్ఞాపనలు పంపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు, కేసులను ఈసీ పరిశీలించాలని, ఎన్నికల నియమావళి అభ్యర్థులు సక్రమంగా అమలయ్యేలా చూడాలని విజ్ఞాపనలు అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆదాయాలు, ఇప్పుడు ఐదేళ్లలో విపరీతంగా పెరిగాయని వాటిని పరిశీలించాలని కోరారు. గత అఫిడవిట్, తాజాగా సమర్పించే అఫిడవిట్లను పోల్చి చూడాలన్నారు. ఈ ఐదేళ్లలో ఆదాయం ఏ విధంగా పెరిగింది.. అక్రమ పద్ధితిలోనా, సరైన మార్గంలోనా అనే విషయాన్ని ముందే పరిశీలించాలని అన్నారు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించడం లేదన్నారు. డబ్బులు, మద్యం పంచడం తెలంగాణలో పెరిగిందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టి ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుత సమయంలో ఎన్నికల అధికారుల నిఘా చాలా కీలకమన్నారు. ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్ కేసులపై కూడా ప్రకటనలు ఇవ్వాలన్నారు. అభ్యర్థి ఆదాయ ధృవీకరణపై పూర్తి స్థాయి పరిశీలన చేయాలని కోరారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని అభ్యర్థులను సరైనన విధానంలో నిర్ధారించాలన్నారు. ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయకుండా చూడాలని వినతి చేశారు. అభ్యర్థుల అఫిడవిట్‌ల పరిశీలన నిక్కచ్చిగా ఉండాలని.. గత ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని అంశాలను ఈ సారి ఎన్నికల్లో అనుభవ పాఠాలుగా చూడాలన్నారు. ఎన్నికల ఖర్చులను తప్పుగా చూస్తున్న అభ్యర్థులే ఎక్కువ అభ్యర్థులపై పర్యవేక్షణ పెంచాలన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మద్యం పంపిణీని నియంత్రించాలని.. అభ్యర్థుల చట్టవిరుద్ధమైన చర్యలను ఎదుర్కోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి న్యాయవాది కోరారు.