Share News

Revanth Rddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటిదగ్గర సందడి వాతావరణం

ABN , First Publish Date - 2023-12-07T09:06:13+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. పలువురు పార్టీ కార్యకర్తలు. ఆయన అభిమానులు తరలివస్తున్నారు.

Revanth Rddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటిదగ్గర సందడి వాతావరణం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. పలువురు పార్టీ కార్యకర్తలు. ఆయన అభిమానులు తరలివస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లి నుంచి కూడా అభిమానులు వచ్చారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరికాసేపట్లో సిఎస్ శాంతి కుమారి కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చే అవకాశముంది. ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు సీఎం పెద్దమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నివాసానికి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు.

ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు.. పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని అడిషనల్‌ సీపీ వెల్లడించారు.

- ఏఆర్‌ పెట్రోల్‌ పంపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లకుండా నాంపల్లి, చాపల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

- ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ సర్కిల్‌ వైపు వెళ్లకుండా.. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

- బషీర్‌బాగ్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ వద్ద కింగ్‌కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రహదారి వైపు మళ్లిస్తారు.

- సుజాత సర్కిల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ఖాన్ భవనం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. సుజాతస్కూల్‌ జంక్షన్‌ వద్ద నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు.

- వాహనదారులు ఎల్‌బీ స్టేడియం సమీపంలో ఉన్న పలు జంక్షన్‌ల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని ట్రాఫిక్‌

పోలీసులు సూచించారు.

- పంజాగుట్ట, వీవీ విగ్రహం, రాజీవ్‌గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైఫాబాద్‌, లక్డీకాపూల్‌, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ కాంప్లెక్స్‌, బషీర్‌బాగ్‌, బీజేఆర్‌ విగ్రహం, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, ఆబిడ్స్‌ సర్కిల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, నాంపల్లి, కేఎల్‌కే బిల్దింగ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, అసెంబ్లీ, ఏంజే మార్కెట్‌, హైదర్‌గూడ ఆయా ప్రాంతాల నుంచి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు పోలీసుల సూచన మేరకు దారి మళ్లింపులు పాటించాలని అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-07T09:06:14+05:30 IST