Viveka Murder Case: సీబీఐ కార్యాలయానికి వచ్చి వెళ్ళిపోయిన అవినాష్ రెడ్డి..

ABN , First Publish Date - 2023-06-18T13:27:50+05:30 IST

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆదివారం కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా విచారణకు రావాలంటూ నిన్ననే సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు.

Viveka Murder Case: సీబీఐ కార్యాలయానికి వచ్చి వెళ్ళిపోయిన అవినాష్ రెడ్డి..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఆదివారం కూడా సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా విచారణకు రావాలంటూ నిన్ననే సీబీఐ అధికారులు నోటీసు ఇచ్చారు. ఉదయం 10:30 గంటలకు సీబీఐ కార్యాలయం అవినాష్ రెడ్డి వచ్చారు. తనతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్‌ (Important Documents)ను తీసుకు వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకు రావాలని నిన్ననే అధికారులు చెప్పారు. దీంతో డాక్యుమెంట్స్‌తో సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన ఇరువై నిమిషాలు ఉండి తిరిగి వెళ్లిపోయారు.

కాగా అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది. అవినాష్ ముందోస్తు బెయిల్ పొందిన తరువాత నాలుగో సారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందోస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-18T13:27:50+05:30 IST